‘రేఖాచిత్రమ్’ మలయాళ సినిమాతో నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న ‘ఛాంపియన్’ సినిమాలో ఆమె హీరోయిన్! హీరో రోషన్ ప్రస్తుతం తన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఛాంపియన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకి డైరెక్టర్. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను, జీ స్టూడియోస్ మరో ఇద్దరి సమర్పణలో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఛాంపియన్’ ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ ఇప్పటికే విడుదల కాగా, వాటికి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఇప్పుడు సినిమా హీరోయిన్ ను పరిచయం చేశారు. బ్లాక్ బస్టర్ ‘సీతా రామం’ తో తెలుగులోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆమె పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. ఆ ట్రెడిషన్ ని కొనసాగిస్తూ, ‘ఛాంపియన్’లో ట్యాలెంటెడ్ మలయాళ నటి అనస్వర రాజన్ ను పరిచయం చేస్తోందీ సంస్థ. సెప్టెంబర్ 8వ తేదీ అనస్వర పుట్టినరోజు సందర్భంగా, చంద్రకళగా అనస్వర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సాంప్రదాయ రెట్రో-స్టైల్ దుస్తులలో గాజులు, సింధూరంతో అందంగా కనిపించింది అనస్వర. కథలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్రను ఆమె పోషించబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఆర్. మాధీ కాగా సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నాడు.

- September 9, 2025
0
34
Less than a minute
You can share this post!
editor