హాస్య నటుడు రోబో శంకర్ మృతి.

హాస్య నటుడు రోబో శంకర్ మృతి.

తమిళ చిత్రసీమలోని ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూనే గురువారం మరణించాడు. శంకర్ తుది శ్వాస విడవడంతో భార్య ప్రియాంక, కూతురు ఇంద్రజ శంకర్, కుటుంబసభ్యులు  కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన అతడిని కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ జీఈఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించాడు. ఈమధ్యే  కామెర్ల వ్యాధి నుండి కోలుకున్న శంకర్  బరువు బాగా తగ్గిపోయాడు. సన్నబడిన అతడిని చూసి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే.. కుకింగ్ షోలో పాల్గొన్న అతడు ప్రేక్షకులను మునుపటిలానే మెప్పించాడు. ఈసారి ఆరోగ్యం విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

editor

Related Articles