“రాబిన్ హుడ్” వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడో?

“రాబిన్ హుడ్” వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడో?

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా “రాబిన్ హుడ్” గురించి అందరికీ తెలిసిందే. మరి నితిన్, వెంకీ నుండి భీష్మ లాంటి సాలిడ్ హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి బజ్‌ని సంతరించుకోగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ డిసెంబర్ 25కే తీసుకొని రావాల్సి ఉంది కానీ వాయిదా పడుతుంది అని టాక్ వచ్చింది. అలా డిసెంబర్ 25 కి వెళ్లొచ్చు అనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఇపుడు మేకర్స్ అఫీషియల్ ఈ సినిమా వాయిదాపై క్లారిటీ ఇచ్చేశారు. సినిమాని డిసెంబర్ 25 కి రిలీజ్ చేద్దామని ట్రై చేశామని కానీ కుదరలేదు అంటూ రాబిన్ హుడ్ రిలీజ్‌ని మైత్రి సినిమా మేకర్స్ ఇపుడు వాయిదా వేశారు. అలాగే కొత్త డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ డేట్ ఎప్పుడు ఏంటి అనేది వేచి చూడాలి.

editor

Related Articles