ఇంట్రెస్టింగ్‌గా మోహన్‌లాల్‌ బరోజ్‌ ట్రైలర్‌

ఇంట్రెస్టింగ్‌గా మోహన్‌లాల్‌ బరోజ్‌ ట్రైలర్‌

హీరో మోహన్‌లాల్‌  బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే వీటిలో ఒకటి బరోజ్‌. మోహన్‌లాల్ స్వీయ డైరెక్షన్ చేస్తున్నాడు. మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ డిగామా బంగ్లాలోపల ఎవరికీ కనిపించని భూతం ఉందంటూ ఓ చిన్నారి వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్‌. వందల ఏళ్లుగా నిధులు కాపాడుకుంటూ వస్తోన్న భూతం. మిగతా వారి కోసం కార్చే కన్నీరు కంటే మహత్తరమైన నిధి ఈ లోకంలో మరేది లేదంటున్నాడు బరోజ్‌. నిధుల తోటకు కాపాలా ఉండే బరోజ్‌ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. మోహన్‌లాల్ స్వీయ డైరెక్షన్‌లో వస్తోన్న సినిమా బరోజ్‌. కనకపు సింహాసనంపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తూ.. సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు. జిజో పున్‌నూసే కథనందిస్తున్న ఈ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్‌ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూరు తెరకెక్కిస్తున్నారు.

మోహన్‌లాల్‌ మరోవైపు నందకిషోర్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమా వృషభ లో కూడా నటిస్తున్నాడు. తెలుగు, మలయాళ బైలింగ్యువల్‌ సినిమాగా వస్తోన్న టాలీవుడ్ నటుడు రోషన్‌ మేక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా కన్నప్పతోపాటు రామ్, రామ్‌బాన్, ఎల్2: ఎంపురాన్ మోహన్‌లాల్ ఖాతాలో ఉన్నాయి.

editor

Related Articles