ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఆర్.కె దీక్ష. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్ గా పనిచేశారు. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా హీరో సుమన్ గారి చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సి కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… చిత్ర దర్శక నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… ట్రైలర్ లాంచ్ చేయాలి అని పిలిచిన వెంటనే హీరో సుమన్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ సినిమాలో 5 పాటలు, 3 ఫైట్స్ తో, మరి కొంత మంది ఆర్టిస్టులతో సినిమా చాలా బాగా వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కు ఒక పాట ఈ సినిమా ద్వారా అంకితం చేశాము. ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదించి గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నాను అన్నారు.
- December 8, 2025
0
37
Less than a minute
You can share this post!
editor


