కాస్టింగ్ కౌచ్‌పై జ‌బ‌ర్ధ‌స్త్ – రీతూ చౌద‌రి సంచ‌ల‌న కామెంట్స్

కాస్టింగ్ కౌచ్‌పై జ‌బ‌ర్ధ‌స్త్ – రీతూ చౌద‌రి సంచ‌ల‌న కామెంట్స్

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన వారిలో రీతూ చౌద‌రి ఒక‌రు. ఆమె ప‌లు సీరియ‌ల్స్, టీవీ షోస్ కూడా చేసింది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోల‌తో పాటు ప‌లు టీవీ షోల‌లో మాత్ర‌మే సంద‌డి చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో కాస్టింగ్ కౌచ్‌పై కూడా నోరు విప్పింది. తాను ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడే అవ‌కాశాల కోసం ట్రై చేసింద‌ట‌. ఖ‌మ్మంలో ఉండే తాను సీరియ‌ల్ ఆడిష‌న్ కోసం వాళ్ల నాన్న‌తో క‌లిసి హైద‌రాబాద్ వ‌చ్చింద‌ట‌. అయితే ఆడిష‌న్ అయ్యాక మేనేజ‌ర్ వ‌చ్చి ఒక సీరియ‌ల్ యాక్ట‌ర్ పేరు చెప్పి అత‌నితో అలా ఉంటేనే అవ‌కాశం వ‌స్తుంద‌ని అన్నాడ‌ట‌. నువ్వు ఎవ‌రిని తీసుకురావొద్దు, ఒక్క‌దానివే రావాల‌ని చెప్పాడ‌ట. నాకు అప్పుడు వెల‌గ‌లేదు. చిన్నపిల్ల‌గా ఉన్న‌ప్పుడే న‌న్ను అలా అడిగారు. సీరియ‌ల్ యాక్ట‌ర్ అలాంటి వాడా అని షాక్ అయ్యాను. ఇక‌ నా కెరీర్ మొదలయ్యాక ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ తోనే ఓ సీరియల్‌లో నటించాను. అప్పుడు ఆ యాక్టర్‌ని.. ఆ సంఘటన గురించి అడగాలి అని అనుకున్నా కాని అడ‌గ‌లేక‌పోయాను. ఆ త‌ర్వాత నాకు మ‌ళ్లీ అలాంటి స‌మ‌స్య ఎదురు కాలేదు అని పేర్కొంది రీతూ చౌద‌రి.

editor

Related Articles