రీతూ వర్మ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బాద్‌షా సినిమాలో కాజల్ స్నేహితురాలిగా కనిపించినా, ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్ లో కనిపించి అలరించింది. చివరికి ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో పోటీకి దిగింది. విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆశించినంతగా అవకాశాలు మాత్రం ఆమెకు దక్కలేదు. ఈ క్రమంలో తమిళంలో దుల్కర్ సల్మాన్, విశాల్ వంటి స్టార్లతో కూడా సినిమాలు చేసినా ఎక్కడా టాప్ కు చేరుకోలేకపోయింది. ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం దాటినా, నటించిన సినిమాలు కూడా డజనుకు మించలేదు. చేసిన అన్ని పాత్రల్లో పక్కింటి అమ్మాయి లాగా, నిండైన చీరకట్టులో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. దీంతో సినిమాల సంఖ్యలో వెనుకబడింది. ఏడాదికి ఒకటి తప్పితే ఎక్కువ సినిమాలు చేతిలో లేవు. గత సంవత్సరం స్వాగ్, ఈ సంవత్సరం సందీప్ కిషన్ – మజాకా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాయమైంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
ఈ నేపథ్యంలో కాలం గడిచేకొద్దీ అనేకమంది ముద్దుగుమ్మలు ‘రయ్’మంటూ ఎంట్రీ ఇవ్వడం, దేనికైనా సై అంటుండటం వల్ల పోటీ పెరిగి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక చేసేదేమీ లేక రీతూ కూడా గ్లామర్ బాట పట్టక తప్పలేదు. నిన్నమొన్నటి వరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈ హైదరాబాద్ అమ్మాయి, ఉన్నఫళంగా ఒక్కసారిగా తాను ఇప్పటివరకు కనిపించని విధంగా గ్లామర్ గేట్లు తెరిచి
ఫొటోషూట్ చూసిన ఆడియన్స్ కు సడన్ షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలు చూసిన వారంతా “ఏంటీ మనం చూస్తున్నది రీతూ వర్మనేనా? ఇలా మారిపోయిందేంటి?” అని ఖంగు తింటున్నారు.
