టీమ్ ఇండియా యువ క్రికెటర్ రింకూసింగ్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు. ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను రింకూసింగ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. నగరంలోని ప్రముఖ హోటల్లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ, క్రీడారంగ ప్రముఖలు హాజరయ్యారు. ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో రింకూ, ప్రియ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్, రాజీవ్‌శుక్లా, జయాబచ్చన్, శివపాల్ యాదవ్, క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, పీయూష్ చావ్లా హాజరయ్యారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన రింకూసింగ్.. టీమ్ ఇండియా టీ-20 టీమ్‌లో కీలక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు మచిలీషహర్ స్థానం నుండి ఎంపీగా గెలిచిన ప్రియ లోక్‌సభ ఎంపీగా వ్యవహరిస్తోంది.
- June 9, 2025
0
107
Less than a minute
Tags:
You can share this post!
editor

