నెట్‌ఫ్లిక్స్‌లో మే 31 నుండి స్ట్రీమింగ్‌ కానున్న – రెట్రో

నెట్‌ఫ్లిక్స్‌లో మే 31 నుండి స్ట్రీమింగ్‌ కానున్న – రెట్రో

మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన రెట్రో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఇంప్రెస్‌ చేయలేకపోయింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. కోలీవుడ్ హీరో సూర్య  నటిస్తున్న ప్రాజెక్ట్‌ రెట్రో. సూర్య 44 గా వస్తోన్న ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు  దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో మే 31 నుండి స్ట్రీమింగ్‌ కానుంది. రెట్రో తెలుగు, తమిళంతో పాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనుంది రెట్రో. థియాట్రికల్‌ రిలీజైన నెల వ్యవధిలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా మరి ఎలాంటి స్పందన రాబట్టుకుందనేది చూడాలి. ఈ సినిమాలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సూర్య హోం బ్యానర్ 2డీ నిర్మించిన ఈ సినిమాకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్‌ డీవోపీగా వర్క్‌ చేశాడు.

editor

Related Articles