Movie Muzz

తమన్నా “ఓదెల 2″కి రిలీజ్ డేట్ ఫిక్స్!

తమన్నా “ఓదెల 2″కి రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా చాలాకాలం తర్వాత తెలుగులో చేసిన సినిమా “ఓదెల 2”. దర్శకుడు సంపత్ నంది అందించిన కథతో వస్తున్న ఈ క్రేజీ డివోషనల్ థ్రిల్లర్ సినిమా ఈ మధ్య టీజర్‌తో మంచి బజ్‌ని అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఎప్పటి నుండో సస్పెన్స్ కొనసాగుతోంది. మరి ఫైనల్‌గా ఇపుడు మేకర్స్ రిలీజ్ డేట్‌ని అయితే పవర్‌ఫుల్ పోస్టర్‌తో బదులిచ్చారు. ఇలా ఓదెల పార్ట్ 2 ని మేకర్స్ ఈ ఏప్రిల్ 17న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాకి అశోక్ తేజ దర్శకత్వం వహించగా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి కాంతార, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.

administrator

Related Articles