మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా “మాస్ జాతర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఫైనల్‌గా ట్రైలర్ ట్రీట్‌కి డేట్ వచ్చేసింది.
రవితేజపై ఒక మాస్ పోస్టర్‌తో ట్రైలర్‌ని మేకర్స్ ఈ అక్టోబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఇక ఈ ట్రైలర్‌తో హైప్ ఎక్కడికి వెళుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధమౌతోంది.

