మాస్ మహారాజా రవితేజ సినిమా త్వరలో ‘మాస్ జాతర’ తో అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా, ప్రమోషన్లలో బిజీగా ఉన్న రవితేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రత్యేకంగా నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈగల్ నా ఫేవరెట్ సినిమా. అందులో నేను చేసిన పాత్ర నా కెరీర్‌లో నాకు అత్యంత ఇష్టమైన పాత్ర. కానీ జనాలకు మాత్రం నచ్చలేదు. మంచి ఐడియా ఉన్నా, స్క్రీన్ ప్లే కొంచెం క్లిష్టంగా ఉండటంతో వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారు. అదే కథను సింపుల్‌గా చెప్పి ఉంటే బాగా వర్కౌట్ అయ్యేదని అన్నారు రవితేజ. ఇక తనకి ఇష్టమైన మరో సినిమా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ గురించి కూడా చెప్పాడు. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. చాలా హృద్యంగా ఉంటుంది. కానీ అది కూడా ఆడలేదు. అలానే ‘నేనింతే’ కూడా అప్పట్లో ఆడలేదు. కానీ ఇప్పుడు ఈ రెండూ క్లాసిక్స్‌గా గుర్తింపు పొందాయి అని తెలిపారు. ఇలాంటి మంచి సినిమాలు మొదట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోయినా, కాలక్రమేణా గొప్ప సినిమాలుగా గుర్తింపు పొందడాన్ని రవితేజ గుర్తుచేశారు. ఈగల్ కూడా ఓ రోజు క్లాసిక్‌గా మారవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో మళ్లీ మాస్ ఆడియన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

- October 13, 2025
0
36
Less than a minute
You can share this post!
editor