హీరో రవితేజ ఇటీవల కాలంలో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ‘ధమాకా’ తర్వాత ఆయనకు పెద్ద హిట్ దక్కలేదు. గతేడాది విడుదలైన ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో, రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ గతంలో ‘ధమాకా’తో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా.. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
- May 29, 2025
0
183
Less than a minute
Tags:
You can share this post!
editor

