Movie Muzz

మాస్ జాత‌ర ప్రీ రిలీజ్‌కు గెస్ట్‌గా రానున్న హీరో.

మాస్ జాత‌ర ప్రీ రిలీజ్‌కు గెస్ట్‌గా రానున్న హీరో.

మాస్ మ‌హ‌రాజా రవితేజ ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ధమాకా టైమ్. ఆయన నటించిన ‘మాస్ జాతర’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఈ నేప‌థ్యంలో భారీ ఎత్తున‌ ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కోలీవుడ్ హీరో సూర్య గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విష‌యాన్ని కొద్ది సేప‌టి క్రితం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ 28న (మంగళవారం) హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సూర్య రాబోతుండ‌డం, రవితేజ‌ – సూర్య ఒకే స్టేజ్‌పై క‌నిపించ‌నుండ‌డంతో ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. “మాస్ మీట్స్ క్లాస్” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఒకరోజు ముందే (30న రాత్రి) ప్రీమియర్స్ వేసే అవకాశం కూడా పరిశీలిస్తున్నాం” అని తెలిపారు.

editor

Related Articles