థామా సినిమా కథ బాగున్నా, కథనం అంత బాగాలేదు..!

థామా సినిమా కథ బాగున్నా, కథనం అంత బాగాలేదు..!

హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన లేటెస్ట్ సినిమా ‘థామా’. మ్యాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ నుండి వచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. కథాపరంగా ఈ సినిమా
ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ మిషన్‌పై తన తోటి ఉద్యోగులతో కలిసి అడవిలోకి వెళ్తాడు. అనుకోకుండా ఓ ఎలుగుబంటి అతడిపై దాడికి యత్నిస్తుంది. ఈ క్రమంలో వ్యాంపైర్ అయిన తడకా (రష్మిక) అతడిని కాపాడుతుంది. దీంతో అలోక్ ఆమెను ఇష్టపడతాడు. అయితే, తడకా కారణంగా అలోక్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది..? అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి..? ఇంతకీ (నవాజుద్ధీన్ సిద్ధీఖి) ఎవరు..? తడకాతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది..? అనే అంశాలు తెలియాలంటే ‘థామా’ సినిమాని ఒకసారి థియేటర్లో చూడాల్సిందే.

editor

Related Articles