హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆదిత్య సర్పోదర్ రూపొందించిన హర్రర్ కామెడీ సినిమా ‘థామా’. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా తొలిరోజే రూ.25.11 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేగాకుండా ఆయుష్మాన్ ఖురానా కెరీర్‌లో మొదటిరోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా ‘థామా’ నిలిచింది. మరోవైపు వీకెండ్ వస్తుండటంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

- October 22, 2025
0
29
Less than a minute
You can share this post!
editor