విమాన ప్రయాణాలతో అలసట చెందిన రష్మిక

విమాన ప్రయాణాలతో అలసట చెందిన రష్మిక

రష్మిక మందన్న, తాజాగా తన వృత్తిపరమైన జీవితంలో ఎదుర‌వుతున్న ఓ సమస్యను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు తనకు ఎంతటి కష్టం కలిగిస్తున్నాయో ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఉదయం 3.50 గంటలకు విమానంలో కిటికీ ద్వారా తీసిన ఓ ఫొటోను షేర్ చేసిన రష్మిక, ‘‘ఉదయం 3.50 ఫ్లైట్లలో ప్రయాణించడమంటే చాలా దారుణంగా ఉంటోంది. ఇది రాత్రా? పగలా? అనేది అర్థం కావడం లేదు,’’ అంటూ కామెంట్ చేశారు. అలాంటి టైమ్ లో ప్రయాణాలు చేయడం తనకు చాలా బాధను కలిగించినట్లు తెలిపారు.

‘‘రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోయి లేచి పని చేయాలా? అలా చేస్తే రోజంతా నీరసం. లేక నిద్రపోకుండా మేల్కొని పనిచేసిన తర్వాత నిద్రపోదామంటే టైము చాలడం లేదు? ఎలా చేసినా అదే పరిస్థితి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా కష్టంగా మారుతోంది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గమ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ, రష్మిక బిజీ షెడ్యూల్ వల్ల నిత్యం ఇలా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని అర్థమవుతోంది.

editor

Related Articles