సాధారణంగా సెలబ్రిటీలు ఫిట్‌నెస్ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ తమ అందం, యంగ్ లుక్ కోసం కఠినమైన డైట్‌లు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్ రష్మిక మందన్నా కూడా తన ఫిట్‌నెస్ విషయంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. తాజాగా జిమ్‌లో త్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తూ ఉన్న రష్మిక ఎదుట నోరూరించే డెసర్ట్ ఉంచారు. అయితే ప్రస్తుతం ఆమె కఠినమైన డైట్‌లో ఉండటంతో, ఆ ఇష్టమైన స్వీట్ తినలేని పరిస్థితి వచ్చింది. ఒకవైపు వ్యాయామం, మరోవైపు ఎదుట ఇష్టమైన డెసర్ట్ ఉండటంతో రష్మిక ముఖంలో కోపం, అసహనం, డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్‌లు అందరూ నవ్వుకునేలా చేస్తున్నాయి. ఆ వీడియోను రష్మిక స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా, నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. “పాపం రష్మిక… అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి”, ఫిట్‌గా ఉండాలంటే ఇలాంటి ఆహార నియమాల విషయంలో కఠినంగా పాటించవలసిందే.

- October 18, 2025
0
44
Less than a minute
You can share this post!
editor