ర‌ష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ట్రైలర్ రిలీజ్..

ర‌ష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ట్రైలర్ రిలీజ్..

యానిమ‌ల్, పుష్ప 2 ది రూల్, ఛావా, థామా సినిమాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకుంది హీరోయిన్ రష్మిక మందన్న. అయితే ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంది ఈ హీరోయిన్. ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ఈ సినిమాకు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా సినిమా నుండి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. మనం చిన్న బ్రేక్ తీసుకుందామా.. అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎమోష‌న‌ల్‌గా సాగింది. ఇందులో ర‌ష్మిక బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాను అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

editor

Related Articles