సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. ఇందులో రాశీ ఖన్నా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసింది. నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశీఖన్నా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ‘తెలుసు కదా’ జర్నీ గురించి రాశీఖన్నా మాట్లాడుతూ, ‘కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీంకి కృతజ్ఞతలు. మేం సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నాను. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ‘మల్లిక గంథా…’ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 17న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది.

- September 8, 2025
0
54
Less than a minute
You can share this post!
editor