‘నైంటీస్’ డైరెక్టర్‌తో బేబి జంట సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన రష్మిక

‘నైంటీస్’ డైరెక్టర్‌తో బేబి జంట సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన రష్మిక

గతేడాది బేబి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ  మ‌రో సినిమాను ప్రారంభించాడు. ‘నైంటీస్’. ఎ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ అనే వెబ్ సిరీస్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు ఆదిత్య హాసన్‌తో క‌లిసి కొత్త సినిమాను ప్రార‌భించాడు. ఈ సినిమాలో బేబి జంట ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌బోతున్నారు. తాజాగా ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమ‌య్యింది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మందన్న క్లాప్ కొట్ట‌గా.. న‌టుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఆదిత్య హాసన్‌కి క‌థ‌ను అందించాడు. ప్రొడ‌క్ష‌న్ నెం 32 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ల‌వ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో రానుండ‌గా.. ‘నైంటీస్’. ఎ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ కొన‌సాగింపుగా ఈ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా చిత్ర‌ యూనిట్ వ‌దిలింది. టాలీవుడ్ న‌టుడు శివాజీ, వాసంతిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.

editor

Related Articles