తెలుగమ్మాయి అయిన ఉదయభాను సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయింది. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే ఈ యాంకర్ ఇటీవల త్రిబాణధారి బార్భరిక్ సినిమాపై ప్రమోషన్స్‌లో పాల్గొని ఇండస్ట్రీలో యాంకర్లకు ఎదురవుతున్న అసమానతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల “ఓ భామ అయ్యో రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఇండస్ట్రీలో కొన్ని గ్రూపులు యాంకరింగ్‌ను సిండికేట్‌లా మార్చేశారని ఉదయభాను వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలపై నానా రకాల విమర్శలు వచ్చాయి. కొందరు ఆమెకి అవకాశాలు లేక అలా అంటోందని, మరికొందరేమో వార్తలలో నిలవడం కోసం అలా మాట్లాడుతోందని తెలిపారు. తాజాగా దానిపై క్లారిటీ ఇస్తూ.. “ఆ రోజు నేను జోక్‌గా అన్నా కూడా అది అబద్ధం కాదు. ఈ రంగంలో నాకు ఎదురైన అనుభవాలే నన్ను అలా మాట్లాడేలా చేశాయి. ఎన్నోసార్లు ఈవెంట్‌కు రెడీ అయ్యి వెళ్లాక, ఆ ఛాన్స్ వేరొకరికి ఇచ్చేవారని తెలిపింది. కొన్ని ఛానల్స్ నన్ను అడిగి డేట్స్ బుక్ చేసుకున్నారు, తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ప్రాజెక్ట్ నుండి తీసేశారు. తనపై “హయ్యస్ట్ పెయిడ్ యాంకర్” అనే ట్యాగ్ వేసినప్పటికీ వాస్తవ పరిస్థితి వేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొచ్చి చూస్తే, ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయో తెలుస్తుంది. తాను ఎప్పుడూ సెలెక్టివ్‌గా ఉన్నానని, చిన్న ఇంటర్వ్యూలు చేస్తే తనతో పాటు ఉన్న చిన్న యాంకర్ల భవిష్యత్తును దెబ్బతీయడం అవుతుందని, అందుకే అవి ఒప్పుకునే దానిని కాదని ఉదయభాను పేర్కొంది. ఇండస్ట్రీలో తనపై జరిగిన అన్యాయాలన్నీ త్వరలో బహిరంగంగా చెబుతాను అని ఉదయభాను వెల్లడించారు. ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి. కానీ నేను మాట్లాడేది ఎవరినీ తక్కువ చేయడం కోసం కాదు. వచ్చే తరం కొద్దిపాటి అవగాహన కోసం. తన అభిప్రాయాల్లో ఉండే తాత్వికత (ఫిలాసఫీ) తన చదువుల్లో మాత్రమే కాకుండా, కెరీర్ నేర్పిన జీవిత పాఠాల వలన ఏర్పడిందని చెప్పారు.

- August 16, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor