రష్మికకి కాలికి గాయం అయింది. అప్పటి నుంచి రష్మిక ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. తాజాగా రష్మిక వీల్‌ఛైర్‌పై దర్శనమిచ్చారు. కాలికి కట్టుతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన రష్మిక.. కారు దిగగానే వీల్‌ఛైర్‌లో కూర్చుని వెళ్లారు. కాగా, కాలి గాయంకి సంబంధించి ఫొటోలను ఈ కన్నడ సోయగం ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. నేను జిమ్‌లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్‌లో ఉన్నాను. కోలుకోడానికి కొన్ని వారాలో లేక నెలలు పడుతుందో ఏమో చెప్పలేను. అది ఆ దేవుడికే తెలియాలి. నేను తామా, సికిందర్, కుబేర సెట్స్‌కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. నేను ఆలస్యం చేస్తున్నందుకు నా దర్శకులకు సారీ చెబుతున్నాను. నేను త్వరగా తిరిగి వచ్చి యాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను.
											- January 22, 2025
 
				
										 0
															 76  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				
