‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’ లాంటి హర్రర్ కామెడీ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ మాడ్‌డాక్ ఫిలిమ్స్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ హర్రర్ యూనివర్స్‌లో రాబోతున్న తాజా సినిమా ‘థామా’. ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ ‘థామా’కి దర్శకత్వం వహిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దీపావళికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. సినిమా నుండి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ చూస్తుంటే.. అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ సినిమాగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక ఒక పాత్రలో కనిపించబోతుండగా.. ఆయుష్మాన్ ఖురానా అలోక్‌గా, నవాజుద్దీన్ సిద్ధిఖీ యక్షసాన్‌గా, పరేశ్ రావల్ రామ్ బజాజ్ గోయెల్‌గా యాక్ట్ చేయబోతున్నారు.

- August 19, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor