ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులకి వినోదం పంచే యాంకర్ రష్మీ గౌతమ్. వచ్చీ రానీ తెలుగులో ఆమె వేసే పంచ్‌లు, గ్లామర్ షోతో ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎక్కువగా ఈటీవీలోనే షోస్ చేస్తూ అడపాదడపా సినిమాలలో మెరుస్తోంది. పర్యావరణ ప్రేమికురాలైన రష్మి గౌతమ్.. ఈమెకు కుక్కలంటే ప్రేమ ఎక్కువ, హీరోయిన్ అమల మాదిరే ఎక్కువగా ప్రేమిస్తుంది పెట్ డాగ్స్ అంటే. మూగజీవాల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. వీధుల వెంట ఉండే కుక్కలు, ఇతర జంతువులకు ఎవరైన హాని కలిగిస్తే ఏ మాత్రం ఊరుకోదు. గట్టిగా తన వాయిస్ వినిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్.. ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స అయ్యిందని పేర్కొన్నారు. గర్భాశయంలోని గడ్డలను ఆపరేషన్ చేసి డాక్టర్లు తొలగించినట్టు కూడా రష్మీ పేర్కొంది. డాక్టర్ల సూచన మేరకు రష్మీ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుని ఇప్పుడు వెకేషన్‌కి వెళ్లింది. మండుటెండల్లో సేద తీరేందుకు ఇండోనేషియాలోని బాలీకి స్నేహితులతో కలిసి వెళ్లారు. పలు ప్రాంతాలలో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది.
- April 28, 2025
0
79
Less than a minute
Tags:
You can share this post!
editor

