రానా మై బ్రదర్..అన్న సామ్

రానా మై బ్రదర్..అన్న సామ్

హీరో రానా, నటి సమంతల అనుబంధం మనకు తెలిసిందే. ‘బెంగళూరు డేస్’ తమిళ రీమేక్‌లో రానా సమంత నటించారు. ఈ సినిమా నుంచే ఇరువురు బంధం ఏర్పడింది. ఇటీవలె జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో కూడా రానా సమంతను ‘మై సిస్టర్’ అనే అన్నారు.

          రానా పుట్టిన రోజు సందర్భంగా ఇస్‌స్టాలో, ‘హ్యాపీ బర్త్‌డే డియర్ రానా. నీ శ్రమించే తత్వం నాలో స్పూర్తి నింపింది. నేను చేసే ప్రతి పని ఇంకా బాగా చేసేలా అది నన్ను ప్రేరేపిస్తుంది. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుని ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్న’ అని పోస్ట్ చేశారు.

         ఆమె ఏజెంట్ హనీగా సిటెడెల్ హనీ బన్నీతో సమంత మనందరిని అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రక్తబ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు సామ్.

editor

Related Articles