రాంబాయి ప్రేమకథ

రాంబాయి ప్రేమకథ

ఈ సినిమా ద్వారా సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వరంగల్‌, ఖమ్మం సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘నీది నాది ఒకే కథ’ ‘విరాటపర్వం’ వంటి వినూత్న కథా చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు వేణు ఊడుగుల. ఆయన నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా రూపొందిస్తున్న సినిమాకి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో కథానాయికను యెనగంటి రాంబాయి పాత్రలో పరిచయం చేశారు. బొగ్గు గనుల ప్రాంతమైన ఇల్లెందు మండలం నేపథ్యంలో అందమైన గ్రామీణ ప్రేమకథగా తీర్చిదిద్దిన్నట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘కథ జరిగిన ప్రాంతం, అక్కడి మనుషుల అమాయకత్వం, వారి మధ్య సంఘర్షణ నన్ను ఎంతగానో కదిలించింది. ఈ కథ విని ఈటీవీ విన్‌ వాళ్లు మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు’ అని చెప్పారు. ఈ కథలోని పాత్రలన్నీ సహజంగా కనిపిస్తాయని ఈటీవీ విన్‌ హెడ్‌ సాయికృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమాకి సంగీతం: సురేష్‌ బొబ్బిలి.

administrator

Related Articles