టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అంటూ రాబోతున్నాడని తెలిసిందే. RAPO 22గా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేం మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రామ్ టీం. పాటలకు మంచి స్పందన వస్తుండగా.. మేకర్స్ టీజర్ విడుదల చేసిన విషయం తెలసిందే. రామ్ అభిమానులతోపాటు సినిమా లవర్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. తన కోస్టార్ రామ్‌పై ప్రశంసలు కురిపించింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. రామ్ హార్డ్‌వర్క్, డెడికేషన్‌ను ప్రశంసిస్తూనే.. అభిమానులే అతడి బలం అని చెబుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
సాగర్‌లా నువ్వందించిన మ్యాజిక్ అనుభూతిని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు పొందుతారా..? అని ఎదురుచూస్తున్నా. మీరు చేస్తున్న కృషి, మీ డెడికేషన్ చూసి ఆశ్చర్యమేస్తుంది. ఆంధ్రాకింగ్ తాలూకా నీ అభిమానులకు అతి పెద్ద విజయం.. అంటూ రాసుకొచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
