చాలా కాలం విరామం తర్వాత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తిరిగి బాలీవుడ్ బాట పట్టి తెరకెక్కిస్తున్న సినిమా పోలీస్ స్టేషన్ మే భూత్.
మనోజ్ బాజ్‌పాయ్, జెనీలియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో శర వేగంగా జరుగుతోంది. అయితే రెండు రోజుల క్రితం కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా ఉన్న ఓ హీరోయిన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ పెట్టిన ప్రేక్షకులకు చిన్న టెస్ట్ పెట్టాడు. వర్మ తాజాగా ఆ పూర్తి ఫొటోను రివీల్ చేశాడు. అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తోందని వెల్లడించాడు. అయితే భూతం పాత్ర మాత్రం కాదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే.. వర్మ రిలీజ్ చేసిన ఫొటోలో రమ్యకృష్ణ నెవర్ బిఫోర్ లుక్‌లో దర్శనమిచ్చి చూసే వారిని షాక్‌కు గురి చేసింది. ఆ చిత్రాలు చూసిన వారంతా ఖంగు తింటున్నారు.

