ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్ తో వివాదాస్పదంగా మారాడు. శుక్రవారం (సెప్టెంబర్ 05)న టీచర్స్ డే సందర్భంగా వర్మ తన గురువులకు విషెస్ తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో్ అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్ బర్గ్, అయాన్ రాండ్ తో పాటు భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పేరును కూడా చేర్చారు. వర్మ తన పో స్ట్ లో ఇలా రాసుకొస్తూ.. నేను దర్శకుడిగా మారడానికి లైఫ్ లో నేను నచ్చింది చేయడానికి నన్ను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే ఒక బిగ్ సెల్యూట్. నాకు ప్రేరణగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్ బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీంలకి టీచర్స్ డే శుభాకాంక్షలు అంటూ వర్మ రాసుకొచ్చాడు. అయితే ఈ పో స్ట్ పై నెటిజన్లు వర్మని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. తన జీవితంలో తనకు మార్గనిర్దేశం చేసిన గురువుల జాబితాను ప్రకటిస్తూ.. అందులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పేరును చేర్చడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక ఉగ్రవాదిని గురువుగా చెప్పుకోవడం సరైంది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- September 6, 2025
0
70
Less than a minute
You can share this post!
editor