జెట్ స్పీడ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌ ‘పెద్ది’ షూటింగ్..

జెట్  స్పీడ్‌లో  రామ్‌చ‌ర‌ణ్‌  ‘పెద్ది’  షూటింగ్..

హీరోగా రామ్ చరణ్‌ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేక‌ర్స్‌. ఈ షెడ్యూల్‌లో భారీ పోరాట సన్నివేశాలతో పాటు, చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజాగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ.. సెట్స్ నుండి కొత్త ఫొటోను పంచుకుంది టీమ్. ఇందులో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానాతో పాటు రామ్ చ‌ర‌ణ్, బాలీవుడ్ న‌టుడు దివ్యేందు శ‌ర్మ క‌లిసి ఉన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

editor

Related Articles