రామ్‌చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్.. క్రెడిట్ మొత్తం అత‌నికే..

రామ్‌చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్.. క్రెడిట్ మొత్తం అత‌నికే..

గేమ్ ఛేంజర్ తర్వాత హీరో రామ్‌చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఓ టాక్ అయితే న‌డుస్తోంది. సినిమాలో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, కన్నడ యాక్టర్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మాస్ అవతార్‌లో చరణ్ క‌నిపించ‌గా, “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసెయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.” అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అద‌ర‌గొట్టాడు గ్లోబ‌ల్ స్టార్. ఇక గ్లింప్స్ చివ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్ క్రికెట్ షాట్ ఒక‌టి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. అయితే ఈ షాట్ ఆలోచ‌న ఎవ‌రిది అనేది తాజాగా బుచ్చిబాబు వివ‌రించారు. ఫైట్ మాస్ట‌ర్ న‌వ‌కాంత్ ఆ షాట్‌ని డిజైన్ చేయ‌గా, అత‌నికే ఆ క్రెడిట్ ఇవ్వాల‌ని నేను అనుకుంటున్నాను అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.

editor

Related Articles