రిజెక్ట్ అయిన స్క్రిప్ట్‌కి కొత్త జీవం ఇచ్చిన రామ్ చరణ్!

రిజెక్ట్ అయిన స్క్రిప్ట్‌కి కొత్త జీవం ఇచ్చిన రామ్ చరణ్!

హీరోలు ఒక్కోసారి కథను ఎంపిక చేసేటప్పుడు తమ ఇమేజ్‌, అభిమానుల రియాక్షన్‌, బిజినెస్ కాలిక్యులేషన్స్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే చాలా మంచి కథలు చేతులు మారి చివరికి ఎవరికో సక్సెస్‌ని అందిస్తాయి. ఇలా హీరో పవన్ కళ్యాణ్, హీరో ప్రభాస్ ఇద్దరూ వదిలేసిన ఒక కథతో హీరో రామ్ చరణ్ ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు “నాయక్”. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్ని ఉన్నా, ఆయన వదిలేసిన సినిమాల లిస్ట్ కూడా అంతే పెద్దది. ఇడియట్, అతడు, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, పోకిరి, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి వంటి హిట్లు మొదట ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెంత‌కు వ‌చ్చాయి. అలాగే ప్రభాస్ కూడా ఒక్కడు, దిల్, ఆర్య, బృందావనం, డాన్ శీను, ఊసరవెల్లి వంటి చిత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించాడు. అయితే, వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన “నాయక్” కథ ముందుగా ప్రభాస్‌కి వినిపించారట.

editor

Related Articles