హీరో జూ. ఎన్టీఆర్, హీరో రామ్ చరణ్.. వీరిద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. సినిమా ప్రమోషన్ సమయంలో వీరిద్దరు తమకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ బాండింగ్ చూసి అభిమానులు తెగ సంబరపడి పోయారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను కీరవాణి లండన్‌లో నిర్వహించగా, ఆర్ఆర్ఆర్ టీం రాయల్ ఆల్ బర్ట్ హాల్లో మెరిసింది. గతంలో అక్కడ బాహుబలి లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కీరవాణి కలిసి సందడి చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఒకే వేదికపై RRR త్రయం కనిపించడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో పాటు తారక్‌కి చరణ్ ముద్దు పెట్టడం అక్కడి వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. నాటు నాటు సాంగ్‌కి ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. హాలీవుడ్ వాళ్లు సైతం తెలుగు సినిమా వైపు చూసేలా ఆర్ఆర్ఆర్ సినిమా సంచలనాలు సృష్టించింది.
- May 12, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor

