బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ తన ఆర్థిక పరిస్థితి గురించి వస్తున్న రూమర్లని ఖండించారు. అతని సినిమా ‘బడే మియా ఛోటే మియా’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో, జాకీ దివాలా తీశారనే ప్రచారం జోరుగా సాగింది. తినడానికి డబ్బుల్లేవని, జుహూలోని తన ఆఫీస్‌ను అమ్మేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ ప్రచారాలపై స్పందించిన జాకీ, నేను దివాలా తీశానని, దేశం వదిలి పారిపోయానని, తినడానికి డబ్బుల్లేవంటూ ప్రచారం చేశారు. ఈ రూమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ‘బడే మియా ఛోటే మియా’ విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జాకీ ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సినిమా విషయంలో అలీ అబ్బాస్ జాఫర్‌కి డైరెక్షన్ ఇవ్వడమే ఒక పొరపాటు అని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం రూ.102 కోట్లు మాత్రమే వసూలు చేయడం వల్ల, జాకీ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా వంటి ప్రముఖులు నటించినా, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. ఈ క్రమంలో మేము పడిన బాధ ఎవరికీ అర్థం కాదు. ఈ సినిమాని నిర్మించడానికి మా ఆస్తులను కూడా తాకట్టు పెట్టాం అని చెప్పుకొచ్చారు.

- July 5, 2025
0
108
Less than a minute
Tags:
You can share this post!
editor