తమిళ హీరో రజనీకాంత్ ఇంకా యంగ్ హీరోల మాదిరి, ఏడు పదులు దాటినా రజనీ ఇమేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమా విజయం సాధిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ‘జైలర్’ సినిమాతో నిరూపణ అయ్యింది. రూ.220 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసి, రజనీకాంత్ స్టామినా ఏంటో తెలియజెప్పింది. ప్రస్తుతం ‘కూలీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రజనీ. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమా కోసం కోట్లాది మంది రజనీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే.. ‘కూలీ’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించినందుకు గాను రూ.150 కోట్ల పారితోషికాన్ని రజనీకాంత్ అందుకున్నారనేది ఆ వార్త సారాంశం. నిజానికి ఈ సినిమా బడ్జెట్ రూ.375 కోట్లని తెలుస్తోంది. అందులో రజనీ రూ.150 కోట్లు, లోకేష్ కనకరాజ్ రూ.50 కోట్లు పారితోషికాలను అందుకోగా, ఇతర పారితోషికాలు, సినిమా మేకింగ్‌కి మిగిలిన రూ.275 కోట్లు ఖర్చు పెడతారన్నమాట. మరో విషయం ఏంటంటే.. ఇప్పటికే ఈ సినిమాకు రూ.240 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. ఇంకా జరగాల్సిన బిజినెస్ చాలా ఉంది.
- May 31, 2025
0
76
Less than a minute
Tags:
You can share this post!
editor

