సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌ను అందుకున్న హీరో వెంకటేష్.. తమిళ హీరో రజనీకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా షేర్ చేశారు. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన ఆధ్యాత్మిక చింతన గురించి, సినీ ప్రయాణంలో రజనీకాంత్ ఇచ్చిన విలువైన సలహా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వెంకటేష్ మాట్లాడుతూ “రజనీకాంత్‌కు, నాకు ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. ఆయన నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి ఆయన పనిచేశారు. నేను చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చిన సమయంలో ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. సినిమా విడుదల సమయంలో బ్యానర్లు కట్టారా? పోస్టర్లలో మన ముఖం బాగా కనిపిస్తోందా? మ్యాగజైన్ ముఖచిత్రంపై మన ఫొటో వేశారా? వంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించవద్దని ఆయన సూచించారు. మనం మన పని చేసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అప్పటి నుండి నేను ఆయన చెప్పిన ఆ సలహానే పాటిస్తున్నాను. ప్రచార ఆర్భాటాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. దేని గురించీ ఎక్కువగా ఆలోచించను” అని అన్నారు.
- April 30, 2025
0
226
Less than a minute
Tags:
You can share this post!
administrator

