కోలీవుడ్ హీరో రజినీకాంత్ నటించిన రీసెంట్ భారీ హిట్ సినిమాల్లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో చేసిన సెన్సేషనల్ హిట్ సినిమా “జైలర్” ఆ విషయం మీకు తెలిసిందే. మరి రజినీకి తన రేంజ్ భారీ కం బ్యాక్‌లా నిలిచిన ఈ సినిమాకి దర్శకుడు సీక్వెల్‌ని కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెల్‌పై ఇపుడు ఓ సాలిడ్ అప్‌డేట్ అయితే వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాని తలైవర్ ఈ డిసెంబర్ మొదటి వారంలోనే మొదలు పెట్టేయనున్నట్టుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఓ సాలిడ్ వీడియో కూడా విడుదల చేసి షూట్‌పై అప్‌డేట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఆల్‌రెడీ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో “కూలీ” అనే భారీ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది దాదాపు తన పోర్షన్స్ పూర్తి కావస్తుండగా ఇపుడు జైలర్ 2 కి కూడా తలైవర్ సన్నద్ధం అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి మాత్రం రానున్న రోజుల్లో రజినీకాంత్ నుండి సాలిడ్ ట్రీట్ ఫ్యాన్స్‌కి రాబోతోందనే చెప్పాలి.

- November 28, 2024
0
46
Less than a minute
You can share this post!
editor