మాస్ జాతర’ పై రాజేంద్ర ప్ర‌సాద్ సంచ‌ల‌న కామెంట్స్..

మాస్ జాతర’ పై రాజేంద్ర ప్ర‌సాద్ సంచ‌ల‌న కామెంట్స్..

టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయన పేరు చెప్ప‌గానే ముఖంపై ఫ్యాన్స్‌కి నవ్వు వస్తుంది. మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో అశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఈ నటుడు, ఇప్పటికీ తన హాస్యంతో, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ‘లేడీస్ టైల‌ర్’, ‘అహా నా పెళ్లంటా’, ‘మిస్టర్ పెళ్లాం’, ‘మాయాబజార్’, ‘జులాయి’, ‘సరైనోడు’ వంటి అనేక సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక ఇటీవల కాలంలో కూడా రాజేంద్ర ప్రసాద్‌ విలన్‌, క్యారెక్టర్‌, తండ్రి పాత్రల్లో తనదైన శైలిలో నటించి తన నటనకు న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కాగా, మరోటి శర్వానంద్ నటిస్తున్న సినిమా.
ఇదే సమయంలో సినీ వర్గాల సమాచారం ప్రకారం, రాజేంద్ర ప్రసాద్ త్వరలోనే ఒక కొత్త వెబ్‌ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది ర‌వితేజ న‌టించిన మాస్ జాత‌ర సినిమాలో కూడా రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర పోషించారు.

editor

Related Articles