బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దుండుగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి.. సైఫ్‌ను కత్తితో పొడిచాడు. దీంతో ఆయకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. దీనిపై సినీ నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి తనను ఎంతగానో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇది నిజంగా బాధాకరమని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగిరావాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. మరోవైపు అభిమానులు కూడా సైఫ్ క్షేమంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

- January 16, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor