మ‌హేష్‌బాబు సినిమా కోసం అమాంతంగా రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన రాజమౌళి..!

మ‌హేష్‌బాబు సినిమా కోసం అమాంతంగా రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన రాజమౌళి..!

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌డిగా రాజ‌మౌళి తీసిన ప్ర‌తి సినిమా కూడా హిట్టే. చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన బాక్సాఫీస్‌ని షేక్ చేయాల్సిందే. ఇప్పుడు హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో.. కంటిన్యూగా నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా కోసం రాజ‌మౌళి భారీ రెమ్యూన‌రేష‌న్ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. సాధార‌ణంగా రాజ‌మౌళి హీరోలను మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్‌గా రికార్డ్ సృష్టిస్తున్నాడు. SSMB29 ప్రాజెక్ట్ కోసం మ‌హేష్‌బాబు కంటే రెండింతల భారీ రెమ్యూనరేషన్ రాజమౌళి తీసుకుంటున్నారు అనే వార్త బ‌య‌ట‌కు రాగా, అంద‌రూ ఆశ్చర్యపోతున్నారు. రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్‌తో పాటు ఈ మ‌ధ్య సినిమా ప్రాఫిట్స్‌లో కూడా షేర్ తీసుకుంటున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ షెడ్యుల్‌లో  ఒక భారీ యాక్షన్ సీన్‌ను షూట్ చేయబోతున్నారు.  మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో పాటు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఈషెడ్యుల్‌లో యాక్ట్ చేయబోతున్నారు. అంతే కాదు ఈ భారీ యాక్షన్ సీన్ కోసం 3 వేల మంది ఆర్టిస్టులను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది.

editor

Related Articles