తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రాజ్‌తరుణ్ సినిమా..

తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రాజ్‌తరుణ్ సినిమా..

రాజ్‌తరుణ్‌ హీరోగా ద్విభాషా సినిమా తెరకెక్కనున్నది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా ఈ సినిమా రూపొందనుంది. ఆదివారం రాజ్‌తరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మేకర్స్‌ తెలియజేశారు. రఫ్‌నోట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ కంప్లీట్‌ న్యూ అవతార్‌లో కనిపిస్తారని, ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యేలా వైవిధ్యంగా, న్యూ షేడ్స్‌తో హీరో కేరక్టరైజేషన్‌ ఉంటుందని, యాక్షన్‌ ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కథ, కథనాలు స్ట్రాంగ్‌గా ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందనున్నట్టు వారు తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

editor

Related Articles