రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ‘ఆహా’ ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’. కుషిత కల్లపు హీరోయిన్. అభినయ కృష్ణ దర్శకుడు. రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మాతలు. నవంబర్ 7న ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం వినోదం, యాక్షన్‌తో కూడుకుని ఉంది. ఇందులో రాజ్‌తరుణ్ పోషించిన పాత్ర పేరు శివ. తను పుట్టగానే మహర్జాతకుడు అవుతాడని పండితులు చెబుతారు. చిన్నప్పట్నుంచీ తనకు స్పీడెక్కువ. అందుకు తగ్గట్టు అంబులెన్స్ డ్రైవర్ అవుతాడు. అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైన శివకు తనకు తెలీకుండానే అతీంద్రీయ శక్తులు వస్తాయి. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారో తనకు తెలిసిపోతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే ప్రశ్నతో ట్రైలర్ ముగించారు. సంగీతం: అచ్చుమణి.
- October 28, 2025
0
36
Less than a minute
You can share this post!
editor

