డోర్ లాక్స్ చేయడం కష్టంగా మారింది: రాధిక

డోర్ లాక్స్ చేయడం కష్టంగా మారింది: రాధిక

సెలబ్రిటీల జీవితశైలి అంటేనే విలాసవంతంగా ఉంటుంది, ఇది పబ్లిక్ సీక్రెట్. బాలీవుడ్ స్టార్లు ఎప్పుడూ లగ్జరీ జీవితం మీద దృష్టి పెట్టినా, దక్షిణాది నటులు మాత్రం చాలామంది సాదా జీవనాన్ని గ‌డుపుతుంటారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల నుండి మిడ్ – జనరేషన్ స్టార్స్ అయిన మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వరకు ఎంతటి క్రేజ్ ఉన్నా కూడా చాలా సింపుల్ లైఫ్ ని ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ లో సీనియర్ నటీమణిగా పేరు సంపాదించుకున్న రాధికా శరత్ కుమార్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. చెన్నై ఈసీఆర్‌ లో ఉన్న ఆమె విలాసవంతమైన భవంతిని వదిలేసి ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిన‌ట్టు తెలిపారు. అద్దెకి ఇచ్చిన బంగ్లా సుమారు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఏకంగా ఏడు ద్వారాలు కలిగిన ఈ ఇంటిలో కొన్నేళ్లుగా రాధికా, శరత్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు. అయితే, ఆ ఇంటిని నిర్వహించడం, తలుపులన్నింటికి రాత్రిళ్లు గ‌డియ‌లు వేయడం వంటి పనులు ఎక్కువ కావడంతో, వయసు మీద పడుతున్న ఈ దంపతులు ఇక ఈ ఇల్లు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. ఇంట్లో 15 మంది పనివాళ్లు ఉన్నా, ఈ ఇంటిని పూర్తిగా నిర్వహించడం చాలా కష్టంగా మారింది. పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. కొడుకు విదేశాల్లో ఉన్నాడు. అంత పెద్ద ఇంట్లో ఇద్దరం మాత్రమే ఉండటం కూడా ఒంటరితనం కలిగిస్తోంది. అందుకే, ఆ ఇంటిని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి అద్దెకిచ్చేశాం అని శ‌ర‌త్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

editor

Related Articles