అందాల హాట్ బ్యూటీ రాశీ ఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకుని కూర్చుంది. చాలాకాలాం నుండి రాశీ హీరోయిన్ రేసులో పరిగెడుతోంది కానీ.. అంత హిట్‌ను మాత్రం అందుకోలేకపోతోంది. ఇక ఈ మధ్య వచ్చిన తెలుసు కదా కూడా రాశీకి పరాజయాన్నే అందించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ పలు కథలు వింటోందని టాక్. ఇక సినిమాలు లేకపోయినా.. హిట్ రాకపోయినా కూడా రాశీ అంటే తెలుగువారికి అమితమైన అభిమానం. సింగర్‌గా కూడా రాశీ సుపరిచితమే.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా రాశీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫొటోను షేర్ చేసింది. ఎవరో ఒక అబ్బాయిని హగ్ చేసుకుంటూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కౌగిలింతలో ప్రపంచం మృదువుగా అనిపిస్తుంది అంటూ అందమైన క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రం ఆమె రివీల్ చేయలేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్.. రాశీ బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.

