హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ‘థామా’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమాని కూడా రిలీజ్‌కు రెడీ చేస్తోంది రష్మిక. ఈ సినిమాల తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ‘మైసా’ అనే సినిమాని ప్రకటించింది ఈ స్టార్ బ్యూటీ. ఈ సినిమాని రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌తో రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నటుడు తారక్ పొన్నప్ప నటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈ నటుడు ‘పుష్ప-2’లో తన విలనిజంతో మెప్పించాడు. ఇక ఇప్పుడు రష్మిక నటిస్తున్న ‘మైసా’ సినిమాలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

- October 21, 2025
0
29
Less than a minute
You can share this post!
editor