ఓటిటిలో “పుష్ప 2” కి మంచి రెస్పాన్స్ వస్తోంది!

ఓటిటిలో “పుష్ప 2” కి మంచి రెస్పాన్స్ వస్తోంది!

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్‌తో చేసిన లేటెస్ట్ హిట్ సినిమా పుష్ప 2 గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించి ఇటీవలే ఓటిటిలో కూడా విడుదలయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో పుష్ప 2 ఇప్పుడు గ్లోబల్ లెవెల్ రెస్పాన్స్‌తో అదరగొడుతోంది. ఆల్‌రెడీ వెస్ట్రన్ ఆడియెన్స్‌లో పుష్ప 2 క్రేజీ రీచ్‌ని అందుకోగా ఇపుడు వ్యూస్ పరంగా కూడా పుష్ప 2 భారీ రెస్పాన్స్‌ని నెట్ ఫ్లిక్స్‌లో అందుకుందట. ఇలా కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 58 లక్షలకి పైగా వ్యూస్‌ని నెట్ ఫ్లిక్స్‌లో అందుకుందట. దీంతో ఈ మధ్య కాలంలో ఓ ఇండియన్ సినిమాకి బిగ్గెస్ట్ రికార్డు రెస్పాన్స్ అన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

editor

Related Articles