బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు తనయుడు పవన్ కళ్యాణ్ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం “పురుషః”. ఈ సినిమాకు వీరూ వులవల దర్శకత్వం వహిస్తున్నారు. “వైఫ్ వర్సెస్ వారియర్”, “వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్”, “వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్” అంటూ యూనిట్ రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్లు ఇప్పటికే ఆసక్తిని రేపాయి. ప్రతి మగాడి విజయానికి వెనుక ఓ ఆడది ఉంటుందని, స్వేచ్ఛ కోసం భర్త చేసే పోరాటం ఎంత కఠినమో తెలియజేస్తూ ఈ పోస్టర్లు హైలైట్ అయ్యాయి. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. “బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా శ్రీకాంత్ ఓదెల “పురుషః” చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకి సంగీతం శ్రవణ్ భరద్వాజ్ అందిస్తున్నారు. చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
- November 5, 2025
0
2
Less than a minute
You can share this post!
editor

