ఎవరికి తెలియకుండా పూరి–సేతుపతి మూవీ షూట్ పూర్తి… లోపల ఏం జ‌రిగిందో?

ఎవరికి తెలియకుండా పూరి–సేతుపతి మూవీ షూట్ పూర్తి… లోపల ఏం జ‌రిగిందో?

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్  పాన్-ఇండియా ప్రాజెక్ట్ పూరి-సేతుపతి  షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ చివరి రోజు  పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య  ఎమోషనల్ మూమెంట్స్ కి సంబధించిన వీడియోను టీం విడుదల చేసింది వీడియోలో, పూరి, మొత్తం యూనిట్‌తో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి తెలియజేస్తూ, ఈ ప్రయాణాన్ని  మెమరబుల్, ఆనందకరమైన అనుభవంగా చెప్పారు. పూరి, చార్మీ తమ భావాలను పంచుకున్నారు.  షూటింగ్ సమయంలో ఏర్పడిన బాండింగ్ ని తెలియజేశారు. విజయ్, పూరి జాకెట్‌ చాలా బావుందని అభినందించడం ఫేర్ వెల్ కు ఫన్ టచ్ ని జోడించింది. ఈ చిత్రాన్ని  జెబి  మోషన్   పిక్చర్స్‌  జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

editor

Related Articles