న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తాజాగా ‘పతంగ్’ చిత్ర టీమ్‌తో చేతులు కలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఈ చిత్రం ఈ నెల25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంను ప్రత్యేక్షంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన ఆయన ‘పతంగ్’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తన సమర్పణలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. పతంగుల పోటీతో రాబోతున్న ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు.సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
- November 25, 2025
0
193
Less than a minute
You can share this post!
administrator

